KNR: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వ్యవసాయం మీద అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఎరువులు సరఫరా పూర్తిగా కేంద్రం పరిధిలో ఉంటుందని అన్నారు. ఎరువుల పంపిణీ ఎలా జరుగుతుందో తెలియని ఆయన ఆ పార్టీ అధ్యక్షుడు ఎలా అయ్యారని ప్రశ్నించారు. ఎరువుల లోటుపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని హితవు పలికారు.