NZB: సైబర్ నేరాలు నిరోధించేందుకు పోలీస్ అధికారి సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలని CP సాయి చైతన్య స్పష్టం చేశారు. జిల్లా పోలీస్ కమిషనర్ కమాండ్ కంట్రోల్లో సైబర్ వారియర్స్‌కు సైబర్ నేరాల మీద వాటి నియంత్రణ కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలన్నారు.