SRPT : యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని మునగాల సీఐ రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం రాత్రి మోతె మండలం రాంపురం తండాలో నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు. నేటి యువత, గంజాయి, డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్, సోషల్ మీడియా ద్వారా కలుగుతున్న మోసాలకు బలి అయ్యే ప్రమాదం ఉందని, యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.