VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన స్దానిక MPDO కార్యాలయంలో శుక్రవారం వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతులకు సంపూర్ణంగా ఎరువులు సరఫరా చేయాలని, ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఎరువులు కోసం రైతులు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత శాఖాధికారులపై ఉందన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా అందుబాటులో ఉండాలని ఆదేశించారు.