ఇంగ్లండ్, భారత జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి ఇన్సింగ్స్‌లో ఇంగ్లండ్ 407 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 64 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 243 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ 27, కరుణ్ నాయర్ 7 రన్స్‌తో ఉన్నారు.