KRNL: తమ ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. శుక్రవారం నగరంలోని 45వ వార్డు అశోక్ నగర్లో ఆయన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడి, ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధిని వివరించారు.