VSP: రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం పట్ల జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు శుక్రవారం విశాఖలో హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రక్రియ పూర్తి కాలేదని ఆయన గుర్తు చేశారు.