కోనసీమ: ముమ్మిడివరం నియోజకవర్గంలోని కొత్తలంక, కుండలేశ్వరం, అయినాపురం గ్రామాల పరిధిలో జరుగుతున్న హెడ్ వర్క్స్ షట్టర్స్ పనులను స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గోదావరి వరదలు వచ్చే అవకాశం ఉన్నందున పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు.