ATP: గూగూడులో కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆయనను ప్రధాన అర్చకులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందగా ఉందని ఎంపీ పేర్కొన్నారు.