తమ దేశంలో జనాభా సంక్షోభాన్ని అధిగమించేందుకు చైనా ప్రభుత్వం రివార్డులు ప్రకటిస్తోంది. ఈ క్రమంలో తొలి సంతానానికి రూ.1,15,000, రెండో బిడ్డకు రూ.6లక్షలు, మూడో బిడ్డకు 12లక్షల నగదుతో పాటు మిగితా ప్రోత్సాహకాలను అందిస్తోంది. అయినా చైనా యువత మాత్రం పెళ్లిపై నిరాసక్తిగానే ఉన్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. కాగా, చైనాలో జనాభా క్షిణిస్తోన్న విషయం తెలిసిందే.