VSP: జీవీఎంసీ 29వ వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉరికిటి నారాయణరావు శుక్రవారం ‘ఫ్రైడే – డ్రైడే’, డెంగ్యూ నివారణ కార్యక్రమంలో భాగంగా రామజోగిపేట ఏరియాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.