ASR: జిల్లా గిరిజన ప్రాంతంలో ఉన్న టూరిజం యూనిట్లను ప్రైవేటీకరిస్తే ప్రతిఘటన తప్పదని ఏపీ టూరిజం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గంగరాజు హెచ్చరించారు. సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి వీ. ఉమామహేశ్వరరావు, కార్మికులతో కలిసి శుక్రవారం అరకు వ్యాలీలోని హరిత రిసార్ట్స్ ఎదుట నిరసన తెలిపారు. గిరిజన ప్రాంతంలో టూరిజం యూనిట్లను ప్రైవేటీకరణ చేయడం చట్ట విరుద్ధమని అన్నారు.