W.G: నరసాపురం పురపాలక మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఈనెల 5న ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ ఛైర్పర్సన్ బర్రె శ్రీవెంకటరమణ తెలిపారు. ఈమేరకు ఆమె శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశానికి సకాలంలో కౌన్సెల్ సభ్యులు హాజరు కావాలని కోరారు.