KMM: వాకీ టాకీల వినియోగం ద్వారా వ్యవస్థీకృతంగా డేటాను పొందవచ్చని ఖమ్మం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ అన్నారు. శుక్రవారం ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో 60 డివిజన్లకు చెందిన శానిటరీ జవాన్లకు వాకీ టాకీలు పంపిణీ చేశారు. ప్రతి జవాన్ ఎక్కడ ఉన్నాడో అనే విషయంపై స్పష్టత ఉండటంతో పాటు సమయపాలనపై పర్యవేక్షణ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.