KMM: ఖమ్మం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలపై ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్ షఫీ ఉల్లా సమావేశం నిర్వహించారు. జాతీయ జెండా ఆవిష్కరణ, వివిధ కార్యక్రమాల ఏర్పాట్లపై సానిటరీ సూపర్వైజర్, సానిటరీ ఇన్స్పెక్టర్లతో చర్చించారు. వేడుకలు విజయవంతం అయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.