కోనసీమ: ఆత్రేయపురం పోలీస్ స్టేషన్‌కు దగ్గర ఉన్న ఆంజనేయస్వామి మందిరంలో సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి, హుండీ పగలగొట్టి వేలాది రూపాయల సొమ్ములను చోరీ చేశారు. ఈ విషయం గ్రామస్తులు తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.