సత్యసాయి: పుట్టపర్తి MLA సింధూరరెడ్డి గంటలో నీటి సమస్యకు పరిష్కారం చూపారు. సోమవారం ఆమె పెద్దకమ్మవారిపల్లెలో పర్యటించగా గ్రామస్థులు తాగునీటి సమస్యను తన దృష్టికి తీసుకొచ్చారు. తక్షణం స్పందించిన ఎమ్మెల్యే బోర్ లారీని పిలిపించి నూతన బోరు వేయించారు. బోర్ వేయడానికి భూమిని విరాళంగా ఇచ్చిన ముమ్మనేని కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు.