CTR: నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ సోమవారం పుత్తూరు మండలంలోని గోపాలకృష్ణపురంలో పర్యటించారు. కాగా ఆయన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. కరపత్రాలను పంపిణీ చేశారు.