VSP: విశాఖ డ్రగ్స్ కేసులో పోలీసులు నిన్న డాక్టర్ కృష్ణచైతన్య వర్మను అరెస్టు చేశారు. కూర్మన్నపాలెంలోని ఏ ప్లస్ ఆసుపత్రి సీఈవో అయిన కృష్ణచైతన్యకు డ్రగ్స్ మాఫియాతో లింకులున్నట్లు ఆధారాలు లభించాయి. కొకైన్‌ను రూ. 60 వేలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ముగ్గురు అరెస్ట్ కాగా, మరికొందరి పాత్రపై విచారణ కొనసాగుతోందని విశాఖ పోలీసులు సోమవారం తెలిపారు.