ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. కాచిగూడ-విశాఖ వందేభారత్ లేన్లలో కోచ్ల సంఖ్యను పెంచుతున్నట్లు తెలిపింది. ఈ రైళ్లలో (20703, 20704) ప్రస్తుతం 8 కోచ్లు ఉండగా.. వాటిని 16కు చేరుస్తున్నట్లు వెల్లడించింది. జూలై 10 నుంచి పెంచిన బోగీ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. దీంతో ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యం 530 నుంచి 1128కి పెరిగింది.