GNTR: మేడికొండూరు సెంటర్లో సోమవారం రాత్రి విధులు నిర్వహిస్తుండగా కానిస్టేబుల్ అనిల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అనిల్‌ను అజాగ్రత్తగా, అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. కారు బలంగా ఢీకొనడంతో అతని కాలు పూర్తిగా తెగిపోయింది. వెంటనే స్పందించిన మేడికొండూరు పోలీసులు అనిల్‌ను హుటాహుటిన ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించారు.