VSP: ప్రతి నెల 1 నుంచి 15వ తేదీలోపు రేషన్ డిపోల ద్వారా రేషన్ సరుకులు పొందవచ్చని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. ఆదివారం సాగర్ నగర్ డిపోలో లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేశారు. 65 సంవత్సరాలు పైబడిన వారికి ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. డిపోల దగ్గర క్యూఆర్ కోడ్‌తో అధికారుల సమాచారం ఉంటుందన్నారు.