HYD: హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నం లాంటి అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు హైరైజ్ కెమెరాలను ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతల కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేశారు. దీంతో వీటి ద్వారా క్షణాల్లో రోడ్డుపై జరిగే ఘటనలను 360 డిగ్రీలలో చూడొచ్చు. రెండు కిలోమీటర్ల వరకు వీక్షించే అవకాశం ఉందన్నారు.