BHNG: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల పట్ల అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని AITUC జిల్లా గౌరవ అధ్యక్షులు బోలగాని సత్యనారాయణ పిలుపునిచ్చారు. సోమవారం భువనగిరిలో జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో AITUC జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు, తదితరులు పాల్గొన్నారు.