TPT: అక్రమంగా గంజాయి విక్రయించేందుకు తరలిస్తున్న వ్యక్తిని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు గుర్తించి అరెస్టు చేశారు. గూడూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ ఎస్కే.కరీమా బేగం తమ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించగా సేలంకు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఆమె తెలిపారు.