TG: తప్పుడు ప్రమాణ పత్రాలతో పిటిషన్ దాఖలు చేసిన గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టు రూ.20వేల జరిమానా విధించింది. TGPSC నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని మొత్తం 19 మంది పిటిషన్ దాఖలు చేశారు. ప్రాథమిక వివరాలు పరిశీలించిన కోర్టు.. అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని పేర్కొంది. దీంతో పిటిషనర్లపై చర్యలు తీసుకోవాలని జ్యుడీషియల్ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.