NGKL: పెద్దకొత్తపల్లి మండలంలోని యాపట్ల గ్రామంలో ఆదివారం నూతనంగా నిర్మించ తలపెట్టిన 33/11 కేవీ నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి, ఎస్సీ సబ్ ప్లాన్ కింద మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి జూపల్లి భూమి పూజ చేయనున్నట్లు గ్రామ మాజీ సర్పంచ్ రంగినేని రమేశ్ రావు తెలిపారు. మంత్రి పర్యటనను కార్యకర్తలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని మాజీ సర్పంచ్ తెలిపారు.