• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నిందితులపై కఠిన చర్యలు: కలెక్టర్

NRML: జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుడిపై జరిగిన దాడిని కలెక్టర్ అభిలాష అభినవ్ తీవ్రంగా ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఘటనపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలో వైద్య సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

March 27, 2026 / 02:39 PM IST

కళ్యాణ మహోత్సవానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే

NLG: చిట్యాల మున్సిపాలిటీలోని పదవ వార్డు, అంబేద్కర్ నగర్‌లో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శుక్రవారం సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు ఆయనకు స్వాగతం పలికి సత్కరించారు. కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

March 27, 2026 / 02:36 PM IST

సీతారాముల కళ్యాణంలో ఎమ్మెల్యే దంపతులు

MBNR: భూత్పూరు మండలంలోని మొల్గర, పోతులమడుగు గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. బుధవారం ఆయా గ్రామాల్లోని రామాలయాల్లో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి సతీసమేతంగా పాల్గొని, స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు .కల్యాణ తంతును వీక్షించేందుకు గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

March 27, 2026 / 02:30 PM IST

రామాలయాల్లో కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక పూజలు

ADB: శ్రీరామనవమి సందర్భంగా ఆదిలాబాద్‌లోని పాత హౌసింగ్ బోర్డ్ కాలనీ సీతారామాంజనేయ స్వామి, తీర్పెల్లి రామాలయాల్లో కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, తహసీల్దార్ శ్రీదేవి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

March 27, 2026 / 02:30 PM IST

లారీ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

MBNR: రాజాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బక్క నారాయణరెడ్డి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఓ లారీ ఆయన్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటికైనా జాతీయ రహదారి అధికారులు స్పందించి, పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

March 27, 2026 / 02:24 PM IST

బాలికల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

JN: పాలకుర్తిలోని సాంఘీక సంక్షేమ బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వంటశాలను, భోజనశాలను పరిశీలించారు. వంట చేసే విధానం, ఆహారం ఉడికించే విధానం, ఉపయోగిస్తున్న బియ్యాన్ని, పప్పులు, ఉల్లిగడ్డలు, తదితర సరుకుల నాణ్యతను పర్యవేక్షించారు. నాణ్యత పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 27, 2026 / 02:23 PM IST

‘ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు’

WNP: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీరుణాలు అందించనున్నట్లు కార్పొరేషన్ ఈడీ సిరాజుద్దీన్ అహ్మద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చేనెల 2వరకు https://tgobmms.cgg.gov.in పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వ్యవసాయ పథకాలకు 18-45 ఏళ్లు, వ్యవసాయేతర పథకాలకు 21-50 ఏళ్లు, శిక్షణ కొరకు 18-45 ఏళ్ల వయసు ఉండాలన్నారు. అలాగ, గ్రామీణులకు రూ.1.50 లక్షల ఆదాయం లోపు ఉండాలన్నారు.

March 27, 2026 / 02:23 PM IST

గ్రామంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

NRPT: నారాయణపేట మండలం సింగారం గ్రామంలో శుక్రవారం సర్పంచ్ నాగిరెడ్డి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సర్పంచ్ అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ లక్ష్మప్ప, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

March 27, 2026 / 02:21 PM IST

సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న కలెక్టర్

ASF: ఆసిఫాబాద్ పట్టణంలోని జన్కపూర్‌లోశ్రీరామనవమి సందర్బంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకలో కలెక్టర్ కే. హరిత పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సీతారాముల వారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.

March 27, 2026 / 02:20 PM IST

సిటీ స్కాన్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

NGKL: అచ్చంపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ సిటీ స్కాన్, డయాగ్నోస్టిక్స్ సెంటర్‌ను ఇవాళ ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆధునిక వైద్య సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉండటం ఎంతో అవసరమన్నారు. ఇటువంటి డయాగ్నోస్టిక్ కేంద్రాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు సమయానుకూలంగా పరీక్షలు చేయించుకునే అవకాశాన్ని కల్పిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

March 27, 2026 / 02:20 PM IST

శ్రీరామనవమి సందర్భంగా నాటిక ప్రదర్శన

KMM: కూసుమంచి మండలం జీళ్లచెరువులో సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా శుక్రవారం రాత్రి 8 గంటలకు విప్లవ సింహాలు సాంఘిక నాటికను ప్రదర్శించనున్నారు. శ్రీ నవ్య నాట్యమండలి కళాకారులచే ఈ ప్రదర్శన ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఏటా శ్రీరామనవమి తర్వాత నాటికను ప్రదర్శించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. గ్రామస్థులు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని నిర్వహకులు కోరారు.

March 27, 2026 / 02:20 PM IST

సీతారాముల కళ్యాణానికి విచ్చేసిన భట్టి దంపతులు

BDK: శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకను తిలకించేందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దంపతులు భద్రాచలం చేరుకోగా, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామయ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ మెండుగా ఉండాలని ఆకాంక్షించారు.

March 27, 2026 / 02:20 PM IST

శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్యే

SRD: ఖేడ్ పట్టణంలోని అతి పురాతనమైన రామమందిరంలో నిర్వహించిన రామనవమి ఉత్సవ వేడుకల్లో ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆయన సతీమణి అనుపమ రెడ్డి పాల్గొని రాములవారికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. అనంతరం స్థానిక మండపంలో అంతర్గాం గజేంద్ర ఆశ్రమం పీఠాధిపతి కరణ్ భారతి మహారాజ్ కీర్తన సేవను శ్రవణం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ నగేష్ శెట్కార్ ఉన్నారు.

March 27, 2026 / 02:17 PM IST

ఆగని అక్రమ మట్టి రవాణా

GDWL: గద్వాల మండలం పూడూరు గ్రామ రహదారిలో అక్రమ మట్టి రవాణా విస్తృతంగా కొనసాగుతోందని స్థానికులు తెలిపారు. కొందరు ట్రాక్టర్లతో నిత్యం మట్టిని తరలిస్తూ లాభాల వేటలో ఉన్నారని ఆరోపిస్తున్నారు. అలాగే ఇష్టారీతిన వాహనాలు తోలడంతో రోడ్లు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

March 27, 2026 / 02:17 PM IST

సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

WGL: ఖానాపూర్ మండలం రంగాపురం గ్రామంలోని కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులు సమర్పించుకున్నారు. స్వామి వారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

March 27, 2026 / 02:16 PM IST