• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఈనెల 28న జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్

MDCL: జిల్లా కోర్టు వద్ద మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, ప్రధాన న్యాయమూర్తి బాల భాస్కరరావు తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో సివిల్ కేసులు, కుటుంబ వివాదాలు, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్, భూ వివాదాలకు సంబంధించిన కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.

March 25, 2026 / 01:09 PM IST

వావిళ్ళపల్లిలో పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

యాదాద్రి: సంస్థాన్ నారాయణపురం మండలం వావిళ్ళపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం స్వపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా వివిధ శాఖల అధికారులుగా, ప్రజాప్రతినిధులుగా వేషధారణలు వేసి అలరించారు. తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ పాలనాంశాలపై అవగాహన కల్పించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు యాజమాన్యం బహుమతులు అందజేశారు.

March 25, 2026 / 01:07 PM IST

మండలంలోని వార్డు సభ్యులకు 31 వరకు శిక్షణ

VKB: కోట్‌పల్లి మండలంలోని పంచాయతీల వార్డు సభ్యులకు బుధవారం నుంచి ఈనెల 31 తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సురేందర్ రెడ్డి తెలిపారు. బుగ్గాపూర్‌లోని డీఆర్ ఫంక్షన్ హాల్లో ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ శిక్షణ తరగతులు ఉంటాయని ఎంపీడీవో సురేందర్ రెడ్డి పేర్కొన్నారు.

March 25, 2026 / 01:06 PM IST

ఇంధన కొరత తలెత్తకుండా జాగ్రత్త వహించాలి: కలెక్టర్

ADB: జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం సంబంధిత శాఖల అధికారులు, పెట్రోల్ బంక్ డీలర్లతో నిర్వహించిన జూమ్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రజలకు ఇంధన కొరత తలెత్తకుండా నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తూ సరఫరా నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

March 25, 2026 / 01:04 PM IST

అంబరాన్ని అంటిన రామయ్య పెళ్లి పనులు

BDK: మణుగూరు మండలంలోని శివలింగాపురం ఆలయంలో శ్రీరామనవమి వేడుకల అంబరాన్ని అంటాయి. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ ముత్తయిదువులు సంప్రదాయబద్ధంగా రోకలికి పూజలు నిర్వహించారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ పసుపు కొమ్ములను దంచి, పవిత్రమైన పసుపును సిద్ధం చేశారు. ఈ పసుపును కళ్యాణ తలంబ్రాల్లో వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

March 25, 2026 / 01:04 PM IST

విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన

SRPT: బ్యాంకులు కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాలను, సేవలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని CFL కోదాడ కౌన్సిలర్స్ అన్నారు. NCFE కార్యక్రమంలో భాగంగా బుధవారం అనంతగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు బ్యాంకింగ్ సదుపాయాలు, డిజిటల్ బ్యాంకింగ్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.

March 25, 2026 / 01:04 PM IST

జూన్ వరకు స్టీల్ బ్రిడ్జి పూర్తి చేయాలి: కమిషనర్

HYD: మలక్‌పేట ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ కార్యాలయం నుంచి సంతోష్‌నగర్ వరకు నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులను జూన్‌లోగా పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. సైదాబాద్, సంతోష్‌నగర్ ప్రాంతాల్లో పనులను పరిశీలించి వేగవంతం చేయాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తగ్గించేలా పనులు త్వరగా పూర్తిచేయాలని పేర్కొన్నారు.

March 25, 2026 / 01:03 PM IST

రోడ్డు భద్రతకు ‘IRAD’ యాప్ కీలకం: ఎస్పీ

WNP: రోడ్డు ప్రమాదాల నివారణలో ‘IRAD’ యాప్ కీలకమని వనపర్తి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. ప్రమాద వివరాలను ఈ యాప్‌లో ఖచ్చితంగా నమోదు చేయడం ద్వారా బాధితులకు త్వరగా ఎక్స్‌గ్రేషియా అందుతుందని పేర్కొన్నారు. డేటా విశ్లేషణ ద్వారా ప్రమాదాలను అరికట్టి, రోడ్డు భద్రతను మెరుగుపరచవచ్చని ఎస్పీ స్పష్టం చేశారు.

March 25, 2026 / 01:02 PM IST

ఈద్గా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రాందాస్

KMM: వైరా నియోజకవర్గ కేంద్రంలోని రిజర్వాయర్ ఆనకట్ట సమీపంలో ముస్లింలకు కేటాయించిన ఈద్గా స్థలాన్ని ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న సౌకర్యాలు, స్థల అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. ముస్లిం సోదరుల ప్రార్థనలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశించారు.

March 25, 2026 / 12:55 PM IST

అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

ASF: సిర్పూర్ (యు) మండలంలోని మహగావ్ అంగన్‌వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హరిత ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె చిన్నారులతో ముచ్చటించి, వారి విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. కేంద్రంలో అందుతున్న పౌష్టికాహారం, రికార్డులను తనిఖీ చేసిన కలెక్టర్, గర్భిణులు మరియు బాలింతలకు నాణ్యమైన సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.

March 25, 2026 / 12:50 PM IST

మెదక్ జిల్లా అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష

MDK: జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రతిమా సింగ్ అదనపు కలెక్టర్, ఆర్డీవోలు, తహశీల్దార్లతో గూగుల్ మీట్ ద్వారా కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న భూభారతి, ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎస్.ఐ.ఆర్ (SIR) ఓటరు జాబితా తయారీ. ఇతర రెవెన్యూ అంశాలపై ఆమె దిశానిర్దేశం చేశారు.

March 25, 2026 / 12:48 PM IST

‘జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి’

SRCL: ఈనెల 28న సిరిసిల్ల కోర్టులో జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా SP మహేష్ బి. గీతే అన్నారు. సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు.. లోక్ అదాలత్‌లో కేవలం కాంపౌండ్బుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన కేసులు, కుటుంబ పరమైన నిర్వహణ కేసులు, వైవాహిక వివాదాలు, బ్యాంకు రికవరీ కేసులు మాత్రమే పరిష్కరించుకోవచ్చని తెలిపారు.

March 25, 2026 / 12:47 PM IST

వేసవి యాక్షన్ ప్లాన్.. పవర్ ట్రాన్స్ ఫార్మర్లు

MDCL: వేసవి కాలంలో విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో హబ్సిగూడ సెక్షన్ పరిధిలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. మొత్తం 8 MVA పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను సాంకేతిక బృందాలు పరిశీలిస్తున్నాయి. ఆయిల్ లెవెల్స్, లోడ్ సామర్థ్యం, కూలింగ్ వ్యవస్థలను తనిఖీ చేస్తున్నారు. లోపాలు ఉంటే వెంటనే మరమ్మతులు చేపట్టి నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నారు.

March 25, 2026 / 12:47 PM IST

ప్రజల సంక్షేమానికి కృషి చేస్తా : ఎమ్మెల్యే

SRD: గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని దోమడుగు మూడవ వార్డులో రూ. 79 లక్షలతో అభివృద్ధి పనులకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్య క్రమంలో సమస్యలను పరిష్కరిస్తూ, అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని తెలిపారు.

March 25, 2026 / 12:46 PM IST

పెట్రోల్ కొరత లేదు.. వదంతులు నమ్మవద్దు..!

MBNR: మహబూబ్‌నగర్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే వార్తలను బంకుల యజమానులు ఖండించారు. జిల్లాలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, సరఫరా సజావుగా సాగుతోందని స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళనతో బంకుల వద్ద రద్దీ చేయవద్దని, కేవలం అవసరమైన మేరకే ఇంధనం తీసుకోవాలని వారు కోరారు. తప్పుడు ప్రచారాలను నమ్మి కంగారు పడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

March 25, 2026 / 12:45 PM IST