MDK: జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రతిమా సింగ్ అదనపు కలెక్టర్, ఆర్డీవోలు, తహశీల్దార్లతో గూగుల్ మీట్ ద్వారా కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న భూభారతి, ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎస్.ఐ.ఆర్ (SIR) ఓటరు జాబితా తయారీ. ఇతర రెవెన్యూ అంశాలపై ఆమె దిశానిర్దేశం చేశారు.