TG: కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించి సామాన్యులకు ఊరటనిచ్చిందని బీజేపీ చీఫ్ రాంచందర్ రావు అన్నారు. డీజిల్‌పై సుంకాన్ని సున్నాకు చేర్చడం మోదీ దక్షతకు నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 35% వ్యాట్‌ను తగ్గించి ధరలను రూ.100 లోపుకు తేవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఖజానా నింపుకోవడం పక్కన పెట్టి, ప్రజల ప్రయోజనాలు చూడాలని ఆయన రేవంత్‌ను కోరారు.