TG: బిస్కెట్ ప్యాకెట్లో ప్లాస్టిక్ వ్యర్థం వచ్చిన ఘటనలో బ్రిటానియా, డి-మార్ట్‌లకు రాష్ట్ర వినియోగదారుల కమిషన్ షాక్ ఇచ్చింది. గతంలో జిల్లా ఫోరం విధించిన రూ.25 వేల జరిమానాను సవాలు చేస్తూ బ్రిటానియా వేసిన అప్పీల్‌ను స్టేట్ కమిషన్ కొట్టివేసింది. బాధితురాలికి జరిమానా మొత్తంతో పాటు వడ్డీని కూడా చెల్లించాలని ఆదేశించింది.