ASF: సిర్పూర్ (యు) మండలంలోని మహగావ్ అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హరిత ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె చిన్నారులతో ముచ్చటించి, వారి విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. కేంద్రంలో అందుతున్న పౌష్టికాహారం, రికార్డులను తనిఖీ చేసిన కలెక్టర్, గర్భిణులు మరియు బాలింతలకు నాణ్యమైన సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.