SRCL: ఈనెల 28న సిరిసిల్ల కోర్టులో జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా SP మహేష్ బి. గీతే అన్నారు. సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు.. లోక్ అదాలత్లో కేవలం కాంపౌండ్బుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన కేసులు, కుటుంబ పరమైన నిర్వహణ కేసులు, వైవాహిక వివాదాలు, బ్యాంకు రికవరీ కేసులు మాత్రమే పరిష్కరించుకోవచ్చని తెలిపారు.