BDK: కొత్తగూడెం ఓ బ్యాంక్ ఆధ్వర్యంలో సీతారామచంద్రస్వామి వారి కళ్యాణా బ్రహ్మోత్సవాలకు భద్రాచలం విచ్చేసిన భక్తులకు సేవ చేయాలనే ఉద్దేశంతో త్రాగునీటి బాటిల్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. అందజేసి వారు మాట్లాడుతూ.. మానవ సేవే మాధవసేవ అన్నారు.
PDPL: శాంతినగర్ లోని శ్రీ కోదండ రామాలయంలో కలెక్టర్ శ్రీ హర్ష దంపతులు ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కలెక్టర్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ నూగిళ్ల మల్లయ్య, కౌన్సిలర్ శైలజ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
PDPL: శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ ధర్మారం మండల కేంద్రంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం మంత్రి సీతారాముల కళ్యాణంలో పాల్గొని, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించారు.
SDPT: హుస్నాబాద్ పట్టంలోని మార్కండేయ స్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణంలో పాల్గొన్నారు. వేదమంత్రోచ్చారణల నడుమ స్వామి వారి కళ్యాణాన్ని పండితులు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ దండి లక్ష్మి, వైస్ ఛైచైర్మన్ చిత్తారి పద్మ కౌన్సిలర్లు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
WNP: అమరచింత మండలం ధర్మపురంలో శుక్రవారం యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. మూర్తి (28) మద్యం మత్తులో సీసాతో తలను గాయపరచుకున్నాడు. తీవ్ర రక్తస్రావంతో అతన్ని స్థానికులు 108 ద్వారా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆసుపత్రికి పంపించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NRPT: నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో యువతలో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని ఎంపీ డీకె అరుణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మరికల్ యువ మండలి సభ్యులకు స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డితో యువకులు పాల్గొన్నారు.
MBNR: డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ మొదటి సంవత్సరం 2025 – 26 పరీక్షల షెడ్యూల్ విడుదల అయినట్లు మహబూబ్ నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా. కే. పద్మావతి పేర్కొన్నారు. పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు మేలో ఉంటాయన్నారు. టైమ్ టేబుల్ వెబ్ సైట్లో ఉందని తెలిపారు. పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించాలని వెల్లడించారు.
MNCL: శ్రీరామనవమి సందర్భంగా మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌లోని పలు రామాలయం, హనుమాన్ ఆలయాలను మంత్రి వివేక్ వెంకటస్వామి దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయాలలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ శ్రీరాముడి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.
SRCL: దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం శ్రీ సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మున్సిపల్ ఛైర్మన్ పాలకవర్గం స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మురింగంటి విజయ సారధి, కరుణ దంపతులు కన్యదాతలుగా వ్యవహరించారు.
KMM: జిల్లాలో పాలనా యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా కలెక్టర్ అనుదీప్ పలువురు MROలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం అర్బన్ MROగా జయచందర్ డిప్యుటేషన్‌పై నియమితులయ్యారు. అలాగే కల్లూరుకు బ్రహ్మేశ్వరరావు, ఖమ్మం రూరల్‌కు వినయేందర్ రెడ్డి, నేలకొండపల్లికి రామ్ ప్రసాద్, సింగరేణికి వెంకటేశ్వర్లును బదిలీ చేశారు.
ASF: ఆసిఫాబాద్ MLA కోవ లక్ష్మికి హైకోర్టులో ఊరట లభించింది. క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల ఉద్రిక్తతల నేపథ్యంలో నమోదైన కేసుల దృష్ట్యా ప్రతి వారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలన్న నిబంధనను న్యాయస్థానం రద్దు చేసింది. మున్సిపల్ ఎన్నికలలో MLA సహా పలువురు BRS నాయకులపై కేసులు నమోదయ్యాయి. ఈ తీర్పుతో ఆమెకు పెద్ద ఉపశమనం లభించింది.
వనపర్తి జిల్లాలో గత 24 గంటల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. 21 కేంద్రాల్లో నమోదైన వివరాల ప్రకారం మదనపూర్ దగడలో అత్యధికంగా 39 డిగ్రీలు నమోదయ్యాయి. రేమద్దుల, ఆత్మకూరు 38.9, వెలుగొండ, శ్రీరంగాపూర్ 38.8గా నమోదయ్యాయి. ఇతర ప్రాంతాల్లో కూడా 38 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదై ప్రజలు ఎండలతో ఇబ్బందులు పడుతున్నారు.
JGL: పాత ఆస్తి పన్నులను మార్చి 31లోగా తప్పనిసరిగా చెల్లించాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. శుక్రవారం జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీల్లో బకాయి పన్నుల వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. వసూళ్ల పురోగతిని పరిశీలించి, పెండింగ్ ఉన్న యజమానులకు వెంటనే నోటీసులు జారీ చేయాలన్నారు. పన్నులు చెల్లించని వారిపై నీటి కనెక్షన్ తొలగింపునకు చర్యలు తీసుకోవాలన్నారు.
KMM: సత్తుపల్లి పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన స్వామివారి కల్యాణాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు తిలకించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ విజయకుమార్, మున్సిపల్ ఛైర్మన్ రెహనా బేగం, ఆర్యవైశ్య సంఘం పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
WGL: యుద్ధం కారణంగా ఉమ్మడి WGL జిల్లాలో హోటల్ రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో పర్యాటక ఆధారిత హోటళ్లు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఇప్పటికే అనేక హోటళ్లు బ్రేక్‌ఫాస్ట్ ధరలను పెంచగా, స్విగ్గీ, జొమాటో ఆన్‌లైన్ డెలివరీ సేవలను పూర్తిగా నిలిపివేశాయి. ట్రై సిటీ పరిధిలోని హోటళ్లు మరో వారం రోజుల్లో పూర్తిగా మూతపడే అవకాశం ఉంది.