MDK: నర్సాపూర్ మండలం లింగపూర్ గ్రామంలో శ్రీ పోచమ్మ తల్లి జాతర ఉత్సవాలో పీసీసీ ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ తదితరులు ఉన్నారు.
NZB: బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహనాడు నాయకులు శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఆనంపల్లి ఎల్లమయ్య మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలన్నారు.కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్, శ్రావణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ADB: ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం అమలు తీరు క్లస్టర్ల వారిగా పని దినాలు, చేపడుతున్న పనులు, తదితర అంశాలపై కలెక్టర్ శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షించారు.
MDK: నిజాంపేట మండలంలోని తెట్టెకుంట తండా పాఠశాలను మండల విద్యాధికారి రాములు శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల చదువుతున్న తీరు, పాఠశాలలో నిర్వహిస్తున్న రికార్డులను, వంట గదిని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని సూచించారు.
ADB: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట దీక్ష నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం మద్దతు ప్రకటించారు. మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుమల్ గౌడ్ మాట్లాడుతూ.. న్యాయబద్ధంగా సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉపాధ్యాయ సంఘ నాయకులు మద్దతు ప్రకటించాలన్నారు. వారి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
NZB: ధర్పల్లి శివారు ప్రాంతంలో గల సర్వే నంబర్ 1317 లో కుంట భూమి కాంగ్రెస్ నాయకులు కబ్జా చేశారని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆ భూమికి చెందిన యాజమానులు స్పష్టం చేశారు. ఆ భూమికి సంబంధించిన వారసులు అందుకు సంబంధించిన పట్టా పాస్ పుస్తకాలు చూపించారు. ఇటీవలనే రెవెన్యూ అధికారులతో ఈ భూమిని సర్వే చేయించామని ఒక ఎకరం 13 గుంటలు ఉందని వారు తెలిపారు.
NGKL: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకంలో జరుగుతున్న మోసాలను అరికట్టాలని కొల్లాపూర్ తహసీల్దార్ ఆఫీస్‌లో ప్రజాసంఘాల నేతలు వినతిపత్రం సమర్పించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తరుగు పేరుతో క్వింటాలుకు10 కిలోలు తగ్గించడమే కాక మార్కెటింగ్ వ్యవస్థ తూకంలో మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎమ్మార్వో కొనుగోలు కేంద్రాలలో తనిఖీలు నిర్వహించాలని పేర్కొన్నారు.
HYD: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికను ప్రేమ పేరుతో మభ్య పెట్టి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన గతంలో చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడు గుంజా గురుస్వామికి ఎల్బీనగర్ ఫాస్ట్ ట్రాక్ న్యాయ మూర్తి పోక్సో చట్టం ప్రకారం పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.16వేలు జరిమానా విధించారు.
NLG: కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జహంగీర్, జిల్లా కార్యదర్శి బైరు ప్రసాద్ గౌడ్ పాల్గొని రక్తదానం చేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం వలన ఎంతోమందిని రక్షించిన వారం అవుతామని అన్నారు.
KNR: హుజురాబాద్ డిపోకు డీలక్స్ బస్సులు కేటాయించాలని ప్రయాణికులు కోరుతున్నారు. హుజరాబాద్ నుంచి నిత్యం వేలాది మంది ఉద్యోగస్తులు కరీంనగర్, వరంగల్‌కు ప్రయాణిస్తుంటారు. మహిళలకు ఉచిత ప్రయాణం వచ్చినప్పటి నుంచి వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చొరవ తీసుకొని రవాణా మంత్రితో మాట్లాడి డీలక్స్ బస్సులు ఏర్పాటు చేయించాలని కోరారు.
JN: వార్షిక తనిఖీలలో భాగంగా వర్ధన్నపేట ఏసీపీ అంబటి నరసయ్య దేవరుప్పుల పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ లోని రిజిస్టర్లు, కేసుల దర్యాప్తు, స్టాక్ సంబంధించిన వాటిని పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలపై ఆరా తీశారు. ఫిర్యాదు దారులతో స్నేహపూర్వకంగా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
NZB: రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ 22 న జిల్లాకు రానున్నారు. 22న ఉదయం నిజామాబాద్ నగరానికి చేరుకోని రెంజల్ పీహెచ్‌సీ భవనాన్ని ప్రారంభిస్తారు. తదుపరి నిజామాబాద్‌లోని ఎంసీహెచ్ బిల్డింగ్‌ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా కేంద్ర జనరల్ ఆస్పత్రిని తనిఖీ చేయనున్నారు. 3 గంటలకు జీజీహెచ్‌లో NZB, KMR జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
JN: మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెలీదే వెంకన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా స్టేషన్ ఘనపూర్ గ్రామ పంచాయతీనీ మున్సిపాలిటిగా అభివృద్ధి చేస్తున్నాం అని అసెంబ్లీ లో ప్రకటించిన సందర్భంగా ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి వల్లే మున్సిపాలిటీ సాధ్యమవుతుందని అన్నారు.
KNR: గుండెపోటుతో ఓ యువకుడు మృతి చెందిన విషాదకరమైన ఘటన తిమ్మాపూర్ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని బాలయ్య పల్లిలో రైతులకు జాన్డీర్ ట్రాక్టర్ గురించి అవగాహన కల్పిస్తూ కుప్పకూలి గుండెపోటుతో తుర్కల కొత్తపల్లికి చెందిన అలువాల మల్లేశం(30) మృతి చెందాడు. మృతుడి ఓ ట్రాక్టర్ షో రూంలో మార్కెటింగ్ ఎజెంట్‌గా పని చేస్తున్నట్లు తెలిపారు.
NRPT: ఊర్కొండ మండలం రేవల్లి ప్రాథమిక పాఠశాలను ఎంపీడీఓ కృష్ణయ్య నేడు సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, విద్యా భోధన గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లు ప్రధానోపాధ్యాయుల ద్వారా పరిశీలించారు. బాగా చదువుకుంటే భవిష్యత్‌లో కలిగే ప్రయోజనాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.