KMM: పెనుబల్లి మండల కేంద్రంలో రూ. 20లక్షల వ్యయంతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను శనివారం ఎమ్మెల్యే రాగమయి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను నిర్మించినట్లు చెప్పారు. ప్రజలు, ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ADB: పట్టణంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ అలం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ..శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసులు సమర్థవంతంగా పనిచేశారన్నారు. అనంతరం సైబర్ నేరాలపై రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
HNK: వేలేరు మండల కేంద్రంలో సీఎం కప్ క్రీడల పోటీలను ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజన్న నేడు ప్రారంభించారు. మాజీ ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్ క్రీడాకారులకు ట్రాక్ షూట్ పంపిణీ చేశారు. గెలుపు ఓటములను క్రీడాకారులు సమానంగా తీసుకోవాలని అధికారులు కోరారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.
KMM: ఈనెల 9న గార్ల మండల కేంద్రంలో నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీని జయప్రదం చేయాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దానియకుల రామారావు అన్నారు. శనివారం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా సంఘాలు, పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొనాలని పేర్కొన్నారు.
NGKL: జిల్లాలో క్షయ వ్యాధిని నిర్మూలించాలని కలెక్టర్ బధావత్ సంతోష్ అన్నారు. కలెక్టర్ సంచార వైద్య వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 2,54,431 మందిని పరీక్షించనున్నట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ DMHO తారా సింగ్, తదితరులు పాల్గొన్నారు.
NLG: తెలంగాణ సమగ్ర ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం దేవరకొండలోని బస్ స్టాండ్ వద్ద తెలంగాణ సమగ్ర ఉద్యోగులు నిర్వహించిన రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు.
NRML: పోలీస్ శాఖలో పనిచేస్తున్న హోంగార్డు సిబ్బంది రోజువారి జీతభత్యాలు పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా హోంగార్డు సిబ్బంది శనివారం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తమను గుర్తించి, జీతాలు పెంచడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
HYD: చింతల్‌లోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులకు తీవ్ర అస్వస్థత నెలకొంది. మూడవ అంతస్తులోని బాత్ రూంలో యాసిడ్ కింద పడింది. ఒక్కసారిగా ఘాటు వాసన వెదజల్లడంతో విద్యార్థులు రక్తపు వాంతులు చేసుకున్నారు. అయితే, యాజమాన్యం… తల్లిదండ్రులకు తెలియకుండా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయం తెలుసుకున్న పేరెంట్స్ అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు.
జనగామ: గ్రామీణ క్రీడా రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ క్రీడలను నిర్వహిస్తోందని జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. దేవరుప్పుల మండలంలోని చిన్న మడూర్ గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న క్రీడ పోటీలను వారు ప్రారంభించారు. అలాగే క్రీడాకారులతో మమేకమై కబడ్డీ ఆడి క్రీడాకారులలో మరింత స్ఫూర్తిని పెంచారు.
NZB: సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ మినిమమ్ టైం స్కేల్ ఇస్తూ రెగ్యులర్ చేయాలని PRTU తెలంగాణ నిజామాబాదు శాఖ ఆధ్వర్యంలో శనివారం రిలే నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా PRTU నాయకులు కృపాల్ సింగ్ మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలనీ, పే స్కేల్ అమలు చేసి, మరణించిన ఉద్యోగ కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కోరారు.
NRML: ఆర్థిక అక్షరాస్యతపై ప్రజల్లో అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కోరారు. శనివారం కడెం మండలకేంద్రంలో సిఎఫ్ఎల్ ఆర్థిక అక్షరాస్యత శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక లావాదేవీలు, పథకాలన్నీ బ్యాంకుల ద్వారా ప్రజలకు చేరవేసే విధంగా ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంచేందుకు కృషి చేయాలన్నారు.
BDK: మణుగూరు సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ రవీందర్ రెడ్డి శనివారం డివిజన్‌లోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఇన్వెస్టిగేషన్‌పై తగు సూచనలు ఇచ్చి.. స్టేషన్‌కు వచ్చే బాధితులకు సకాలంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
BDK: భద్రాచలం అయ్యప్ప కాలనీవాసులు శనివారం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావును మర్యాదపూర్వకంగా కలిశారు. తమ కాలనీలో ఇళ్లు తొలగిస్తామని ఎమ్మార్వో ఆఫీస్ నుంచి కొంత మంది ఉద్యోగులు వచ్చి సర్వే చేశారని తెలిపారు. ఈ కారణంగా తాము భయాందోళనకు గురవుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. తాము ఖాళీ చేయాల్సి వస్తే ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.
HYD: ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తున్నామని ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్ అన్నారు. శనివారం ఎంఐఎం పార్టీ కార్యాలయంలో వివిధ ప్రాంతాల ప్రజలు ఎమ్మెల్సీని కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తెచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు.
KMR: సుబ్రహ్మణ్య షష్టిని పురస్కరించుకొని ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో ఎమ్మెల్యే మదన్ మోహన్, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి పాలు, పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం శ్రీవల్లి దేవసేన సమేతంతో చేశారు.