ADB: తలమడుగు మండలంలోని కుచులపూర్ గ్రామంలో ఈనెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరిగే శ్రీ విఠల రుక్మిణి ఆలయ ప్రథమ వార్షికోత్సవానికి హాజరు కావాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను గురువారం కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం గ్రామంలోని పలు అంశాలను ఎమ్మెల్యేతో వారు చర్చించారు. కార్యక్రమంలో నాయకులు కేదారేశ్వర్ రెడ్డి, శ్రీను, గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.
SDPT: హాస్పిటల్ ప్లానింగ్ బాగున్నప్పటికీ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సంబంధిత కాంట్రాక్టర్ సూచించారు. చేర్యాలలో నిర్మిస్తున్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను పరిశీలించారు. కార్య క్రమంలో ఆయనతో పాటు పుర్మ ఆగం రెడ్డి, కొమ్ము రవి మంచాల చిరంజీవులు, శ్రీనివాస్, దాసరి శ్రీశాంత్ తదితరులు ఉన్నారు.
HYD: పరిసరాల పరిశుభ్రతలో భాగంగా క్లీన్ కాప్రాకు సహకరిస్తున్న వారిని సర్కిల్ అధికారులు గురువారం సన్మానించారు. క్లీన్ కాప్రాలో భాగంగా కెమెరాల ఏర్పాటుకు సహకరిస్తున్న వ్యాపారవేత్తలను కాప్రా శానిటరీ ఇన్‌స్పెక్టర్ సుదర్శన్ సన్మానించారు. నిషిద్ధ ప్రాంతాలలో చెత్త వేయకూడదని ఆయన కోరారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండవచ్చాన్నారు.
WNP: క్షయ వ్యాధి నివారణకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. వ్యాధి నివారణకు జిల్లాల్లో చేపడుతున్న100 రోజుల కార్యచరణ ప్రణాళికను విజయవంతం చేయాలని కలెక్టర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు.
PDPL: రామగుండం సింగరేణి సంస్థ 7 LEP గనిలో ఈనెల 3న మరణించిన ఉద్యోగి సత్యనారాయణ కుటుంబ సభ్యులకు GM వెంకటయ్య, DGM (పర్సనల్) అనిల్ కుమార్ సూచన మేరకు స్పెషల్ ఎక్స్‌గ్రేషియా రూ. 15 లక్షలు, మరో రూ. 90 వేల చెక్కులను కార్మిక నాయకుల చేతుల మీదుగా అందించారు. అధికారులు శ్యాం ప్రసాద్, జిగురు రవీందర్, కుటుంబ సభ్యులు అరుణ పాల్గొన్నారు.
HNK: హనుమకొండ సుబేదారి క్యాంప్ కార్యాలయం నందు నిన్న వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఘన విజయం సాధించిన కేఆర్ దిలీప్ రాజ్ గురువారం వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్‌కి శాలువా కప్పి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు.
NZB: అధికారులు ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని ఇంఛార్జి సీపీ సింధుశర్మ సూచించారు. ఇందుకోసం టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. అవినీతి నిరోధక వారోత్సవాల్లో భాగంగా గురువారం నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఇంఛార్జి సీపీ మాట్లాడారు.
SRD: కంగ్టి మండలం ముకుంద నాయక్ తండాకు చెందిన సుజాత సేవాలాల్ రాథోడ్ తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా విజయం సాధించారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విజయం సాధించేలా కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.
MDK: నార్సింగి మండలంలోని సంకాపూర్ గ్రామంలో కలెక్టర్ పర్యటించారు. మహిళా అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగా సంకాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మదర్ పౌల్ట్రీ యూనిట్‌లో సుమారు 2,300 కోళ్ల పెంపకం చేపట్టడం జరుగుతుందన్నారు. 45 రోజుల తర్వాత ఎంపిక చేయబడిన మహిళా సంఘాల్లోని మహిళలకు కోళ్లను అందిస్తామన్నారు.
MHBD: డిసెంబర్-2024 మాసంలో జరిగే సదరం క్యాంపుల గురించి రేపు అనగా 06.12.2024 నాడు మద్యాహ్నం 12:00 గంటలకు అన్ని మీ సేవ సెంటర్లలో స్లాట్లు ప్రారంభమవుతాయి. కావున సంబంధిత వారు స్లాట్ బుక్ చేసుకొని వారికి వచ్చిన తేదీన సదరం క్యాంపు జరిగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మహబూబాబాద్‌లో హాజరు కాగలరని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మధుసూదన్ రాజు ప్రకటనలో తెలిపారు.
మహబూబ్ నగర్: విద్యార్థులకు సమయానికి బస్సులు నడిపించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆత్మకూరు మండలం కొంకనివాని పల్లి గ్రామంలో విద్యార్థులతో కలసి ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఆందోళన నిర్వహించారు. గ్రామం నుండి ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు వందలాది మంది విద్యార్థులు మండల కేంద్రానికి విద్యను అభ్యసించడానికి వెళ్తారని అన్నారు. సమయానికి బస్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
SRPT: ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ గురువారం మునగాల మండల కేంద్రం ఆకుపాములలోని బాలుర గురుకుల పాఠశాల మరియు కళాశాలలో సైబర్ నేరాలపైన, గంజాయి, డ్రగ్స్, మత్తు మందులపై పోలీసు కళా బృందంతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.
KMR: బిచ్కుందలో ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలని ఎస్సై విజయ్ పేర్కొన్నారు. మద్నూర్ పోలీస్ స్టేషన్‌లో గురువారం వారికి అవగాహన కల్పించారు. ఆటోలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ వెంట ఉంచుకోవాలన్నారు. మద్నూర్ బస్టాండ్‌లో ఆటోలను క్రమ పద్దతిలో నిలపాలని సూచించారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
KMR: ఎల్లారెడ్డి పట్టణ ప్రముఖ న్యాయవాది సాయి ప్రకాష్ దేశ్ పాండే కూతురి వివాహ వేడుకలలో గురువారం రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర అగ్ర ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
NRML: రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో సీఎం కప్ నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ అన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సభ్యులు, జిల్లా క్రీడా అధికారులతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఈనెల 10 నుండి 12 వరకు 36 క్రీడా విభాగాలలో సీఎం కప్ పోటీలు ఉంటాయని తెలిపారు.