Wnp: జిల్లా EMRI 108లో పైలట్, మెడికల్ టెక్నీషియన్ పోస్టులకు ఏప్రిల్ 4న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. పైలట్‌కు 10వ తరగతి, హెవీ లైసెన్స్ ఉండాలి. టెక్నీషియన్‌కు సంబంధిత విద్యార్హత అవసరం. ఆసక్తి గలవారు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లా ఆసుపత్రిలోని 108 కార్యాలయానికి హాజరుకావచ్చు. వివరాల కోసం ఈ నంబర్‌ను: 90000 01674 సంప్రదించవచ్చు.
HYD: BJP రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వ్యాఖ్యలు వారి ద్వంద్వ వైఖరిని బయటపెడుతున్నాయని TPCC అధికార ప్రతినిధి చరణ్ కౌషిక్ అన్నారు. ఆలయాలఅభివృద్ధిపై వారు మొసలి కన్నీరు కారుస్తూ, నిధుల వినియోగాన్ని అడ్డుకోవడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాలకు నిధులు కేటాయిస్తుంటే, కేంద్రం మాత్రం తెలంగాణ దేవాలయాల పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతూ నిర్లక్ష్యం చేస్తుందన్నారు.
ASF: మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల వివరాలు విద్యార్థినిలకు దీక్షిత ఫెర్టిలైజర్ ఆధ్వర్యంలో క్రీడా దుస్తులు సామాగ్రిని అందించినట్లు ప్రధానోపాధ్యాయులు మారుబాయి, వార్డెన్ శ్రీనివాస్ తెలిపారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న క్రీడాకారులకు సామాగ్రితో పాటు దుస్తులను అందించినట్లు దీక్షిత ఫర్టిలైజర్ ప్రోప్రేటర్ కవ్వాల సాయి తెలిపారు.
MDK: రామాయంపేట నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు కార్యకర్తలు ప్రదర్శనగా వెళ్లి, అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. గతంలో ఉన్న ఈ నియోజకవర్గాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని, అప్పుడే ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వారు స్పష్టం చేశారు.
SRD: కంగ్టి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 14-15 ఏళ్ల బాలికలకు హెచ్పీవీ (HPV) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డాక్టర్ నాగమణి సోమవారం ప్రారంభించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఈ టీకా ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మహిళల ఆరోగ్య రక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అర్హులైన బాలికలందరూ ఈ టీకా వేయించుకోవాలన్నారు.
NZB: తెలంగాణ సర్పంచుల సంఘం వ్యవస్థాపకుడు డాక్టర్ పిడమర్తి రవి సోమవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా పోతంగల్ మండలం కారేగాం సర్పంచ్ నరహరి సునీల్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సంఘం రాష్ట్ర వ్యవస్థాపకుడు రవికి కృతజ్ఞతలు తెలిపారు.
NZB: మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి యోలు మాల శంకర్‌కు హార్ట్ ఎటాక్ రావడంతో HYD లోని నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. గుండెలో బ్లాక్ ఏర్పడిందని స్టంట్ వెయ్యాలని వైద్యులు సూచించారు. సహాయం కోసం కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సునీల్ రెడ్డిని సంప్రదించగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.4 లక్షల విలువైన LOC ని బాధిత కుటుంబ సభ్యులకు సోమవారం అందజేశారు.
HYD: పాతబస్తీ మెట్రో పనుల వల్ల పురాతన కట్టడాలు దెబ్బతింటున్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. పిల్ విచారణలో ఉండగానే కొన్ని కట్టడాలను కూల్చివేస్తున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై సమాధానం ఇచ్చేందుకు అఫిడవిట్ దాఖలు చేయడానికి మెట్రో నిర్మాణ సంస్థ సమయం కోరింది. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
ఖమ్మం జిల్లాను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో ‘అంతర్జాతీయ జీరో వేస్ట్ డే’ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం వల్ల వన్యప్రాణులకు, పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
BDK: భద్రాచలం ITDA DDకు ఆదివాసీ విద్యార్థి రాష్ట్ర కమిటీ బృందం ఇవాళ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సత్యనారాయణ పురం బాయ్స్ హాస్టల్‌లో మెనూ అమలుపై ఆరోపణలు ఎదురుకుంటున్న వార్డెన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన పేద విద్యార్థులకు మెనూ ప్రకారం అందవలసిన నోటి కాడ కూడును అందియ్యకపోవడం దరిద్రం అని తెలిపారు.
NRPT: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్ బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు.నేరుగా బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఫిర్యాదులు సంబంధిత శాఖ అధికారులకు పంపించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని బరోసా కల్పించారు.ప్రజావాణిలో వచ్చే అర్జీలు పెండింగ్లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులకు చెప్పారు.
BHPL: రేగొండ మండల కేంద్రంలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక రవాణా జరుగుతున్న సమాచారంతో సోమవారం ఎస్సై సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో 4 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
MLG: ప్రజల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దివాకర్ టీఎస్ అధికారులను ఆదేశించారు. ములుగు కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి- గిరివాణి దర్బార్‌లో 96 ఫిర్యాదులు స్వీకరించారు. భూ సమస్యలు, పెన్షన్, ఇందిరమ్మ ఇళ్లపై ఎక్కువగా అర్జీలు వచ్చాయి. ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని సూచించారు.
MBNR: మిడ్జిల్ మండలం సింగందొడ్డి గ్రామంలో వచ్చే నెల 5న నిర్వహించనున్న అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నిర్వాహకులు సోమవారం మండల అధికారులను ఆహ్వానించారు. అంబేడ్కర్ సంఘం నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు కలిసి ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎస్సైలకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. అధికారులు సానుకూలంగా స్పందించి కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతామని భరోసా ఇచ్చారు.
HYD: మహావీర్ జయంతి సందర్భంగా రేపు (మార్చి 31) నగరంలో మాంసం దుకాణాలు మూతపడనున్నాయి. ముఖ్యంగా GHMC పరిధిలోని అన్ని కబేళాలు, మటన్, చికెన్ విక్రయశాలలను మంగళవారం మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బల్దియా అధికారులు హెచ్చరించారు.