• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రోడ్లపై చెత్త వేస్తే లక్ష జరిమానా !!!

HYD: ఇక మీదట గ్రేటర్ హైదరాబాద్ రోడ్ల మీది చెత్త వేస్తే చలాన్ల మోత మోగనుంది. రోడ్లపై చెత్త, భవన నిర్మాణ వ్యర్థాలు వేయకుండా GHMC కొత్త ప్లాన్ సిద్ధం చేసింది. చెత్త వేస్తే భారీగా చలాన్లు వేసేలా ‘కాంప్రహెన్సీ చలాన్ మానిటరింగ్ సిస్టం’ పేరుతో కొత్త యాప్‌ను తీసుకువచ్చింది. మొదటిసారి వేస్తే రూ. 25,000, రెండోసారికి రూ. 50,000, మూడోసారికి రూ. లక్ష ఫైన్ వేయనుంది.

March 6, 2025 / 05:22 PM IST

‘మహిళలకు అన్ని రంగాలలో ప్రాధాన్యతను ఇస్తున్నారు’

HYD: రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు అన్ని రంగాలలో ప్రాధాన్యతను కల్పిస్తున్నారని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ సెంట్రల్ అసోసియేషన్ ఛైర్ పర్సన్ దీపా రెడ్డి అన్నారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను దోమల్ గూడ ఫిజికల్ ఎడ్యుకేషనల్ కాలేజ్‌లో ఘనంగా నిర్వహించారు.

March 6, 2025 / 04:49 PM IST

నిలిచిపోయిన ఎలక్ట్రానిక్ బస్

JN: స్టేషన్ ఘన్‌‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వేణు దాబా వద్ద సాంకేతిక లోపం వల్ల ఎలక్ట్రిక్ బస్సు నిలిచిపోయింది. హన్మకొండ నుంచి ఉప్పల్ వెళ్తున్న ఈ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో కొంతమంది ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకుని వెళ్లారు. మిగిలిన వారికి ఇబ్బందులు తప్పలెదు.

March 6, 2025 / 02:02 PM IST

కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్లు ప్రారంభం

MNCL: కేంద్రీయ విద్యాలయంలో 1వ తరగతి అడ్మిషన్ల కోసం మార్చి 7 నుంచి 21 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ప్రిన్సిపల్ ప్రసాద్ తెలిపారు. ఏప్రిల్ 1 వరకు 6 సంవత్సరాలు నిండిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. https://kvsonlineadmission.kvs.gov.in/index.html అనే వెబ్సైట్‌లో ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

March 6, 2025 / 01:27 PM IST

గడ్డివాములు దగ్ధం..బీఆర్ఎస్ నేతల పరామర్శ

WNP: పట్టణంలోని 5వ వార్డులోని వైశ్యనాయక్ తండాలో జరుపుల తిరుపతినాయక్‌కు చెందిన గడ్డివాములు ప్రమాదవశాత్తు దగ్ధమయింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు దగ్ధమైన గడ్డివాములను పరిశీలించారు. వారు మాట్లాడుతూ..అగ్నిప్రమాదంలో రూ. 80వేల ఆస్తి నష్టం జరిగిందని విచారణ జరిపి బాధితుని ఆదుకోవాలని ప్రభుత్వాన్నికోరారు. గట్టుయాదవ్, శ్రీధర్, రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్ ఉన్నారు.

March 6, 2025 / 11:26 AM IST

బండలాగుడు పోటీలను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

GDWL: రాజోలి గ్రామంలో అడివేశ్వరా స్వామి జాతర సందర్భంగా నిర్వహించిన బండలాగుడు పోటీలను మాజీ సర్పంచులు అయిన కుర్వ కిష్టాన్న, గంగిరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దస్తగిరి గురువారం ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. మొత్తం 10 జతల ఎద్దులు వచ్చాయని, పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కమిటీ నిర్వాహకులు తెలిపారు.

March 6, 2025 / 11:17 AM IST

మంటలను ఆర్పివేసిన ఫైర్ సేఫ్టీ అధికారులు

PDPL: పాలకుర్తి మండలం ఈశాల తక్కళ్లపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో ప్రమాదవశాత్తు, చెలరేగిన మంటలను గురువారం అటవీ శాఖ అధికారులుతో పాటు అల్ట్రాటేక్ సిమెంటు కంపనీ ఫైర్ అధికారులు స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. వేసవిలో చెట్లు ఆకురాలే సమయం కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఎవరు కూడా అడవిని కాల్చరాదని, అటవీశాఖ అధికారి మేఘరాజు తెలిపారు.

March 6, 2025 / 11:07 AM IST

లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు

BDK: పాల్వంచ టౌన్ శ్రీ నిలయం అపార్ట్‌మెంట్‌లో సునీల్ అనే వ్యక్తి తన సెల్ ఫోన్‌లో మహిళల ఫొటోలు తీస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని వాచ్‌మెన్ & లాండ్రీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు నంద్యాల వెంకటేశ్వర్లు అన్నారు. అపార్ట్‌మెంట్‌లో మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని అతనిపై చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి గురువారం ఫిర్యాదు చేశారు.

March 6, 2025 / 10:22 AM IST

ఓయూలో ఘనంగా ముగిసిన న్యాక్ వర్క్ షాప్

HYD: OU న్యాక్ గుర్తింపు ప్రక్రియకు అధ్యాపకులను సన్నద్ధం చేసేందుకు 3 రోజులుగా నిర్వహిస్తున్న ‘న్యాక్ అక్రిడిటేషన్, అవుట్‌కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ త్రూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ డిజిటల్ లెర్నింగ్’ వర్క్‌షాప్ బుధవారంతో ముగిసింది. ఈ వర్క్‌షాప్ ముగింపు కార్యక్రమాన్ని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించారు.

March 6, 2025 / 04:34 AM IST

పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన ఎస్పీ

NRML: నిర్మల్ పట్టణంలోని సోఫినగర్ కేజీబీవీ పాఠశాలను జిల్లా ఎస్పీ జానకి షర్మిల బుధవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే తెలపాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

March 5, 2025 / 07:48 PM IST

తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై జానారెడ్డి స్పందన!

NLG: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పందించారు. కుల గణన అంశంలో తన పాత్ర లేదని, గాలి మాటలు మాట్లాడడం సరికాదన్నారు. తప్పు చేసిన వాడ్ని క్షమించే గుణం తనదన్నారు. తీన్మార్ మల్లన్న ఏ ప్రెస్ మీట్స్ పెట్టుకుంటే.. తనకేంటని జానారెడ్డి పేర్కొన్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, సలహాలు అడిగితే ఇస్తానన్నారు.

March 5, 2025 / 07:42 PM IST

‘నీరా కేఫ్‌ను గీత కార్పొరేషన్‌కు అప్పగించాలి’

SRPT: నీరా కేఫ్‌ను రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్పొరేషన్‌కు అప్పగించాలని తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొల్కపురి శ్రీకాంత్‌ గౌడ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం నాగారం మండల కేంద్రంలో నిర్వహించిన గీత కార్మికుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గీతకార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు.

March 5, 2025 / 07:41 PM IST

‘నీటి సమస్య రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి’

ADB: వేసవికాలం నేపథ్యంలో జిల్లాలోని పలు మండలాలలో నీటి సమస్య రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. నీటి సమస్యను అధిగమించేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఈవో జితేందర్ రెడ్డి, అధికారులు తదితరులున్నారు.

March 5, 2025 / 07:41 PM IST

స్వపరిపాలన దినోత్సవంలో పాల్గొన్న కలెక్టర్

SRPT: నూతనకల్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బుధవారం నిర్వహించిన స్వపరిపాలన దినోత్సవంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాల్గొన్నారు. ఈ మేరకు తరగతి గదిలోకి వెళ్లి ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని సూచించారు.

March 5, 2025 / 07:31 PM IST

‘చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలి’

SRPT: SRSP స్టేజ్ టు ద్వారా సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గ లోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడానికి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ తెలిపారు. కలెక్టరేట్ నుండి ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ, పోలీస్ వ్యవసాయ శాఖ అధికారులతో వెబెక్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. SRSPద్వారా సాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు.

March 5, 2025 / 07:28 PM IST