• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

డ్రైనేజ్ కాలువ పనులు పరిశీలించిన జిల్లా అధ్యక్షుడు

MLG: డ్రైనేజీ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని జిల్లా BRS పార్టీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు సూచించారు. శుక్రవారం ఉదయం మార్నింగ్ వాకింగ్‌లో భాగంగా ఆయన ఏటూరునాగారం గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న డ్రైనేజీ కాలువ పనులను పరిశీలించారు. నీటి ప్రవాహం సాఫీగా ఉండాలని, సరైన లెవెలింగ్ చూసుకోవాలని కాంట్రాక్టర్లకు సూచనలు చేశారు.

March 27, 2026 / 11:19 AM IST

సేమ్ అమ్మాయిలాగే.. తీరా చూస్తే జేబు ఖాళీ.!

HYD: సామాజిక మాధ్యమాల్లో అమ్మాయిల ఫోటోలు, వీడియోలను ఎరగా ఉపయోగిస్తూ మోసగాళ్లు కొత్త పద్ధతుల్లో యువతను వలలో వేస్తున్నారు. AI సాయంతో అమ్మాయి వాయిస్‌లా ఫోన్ కాల్స్ చేసి నమ్మకం కల్పించి, చివరికి డబ్బులు దోచేస్తున్నారు. ఈ తరహా సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని HYD పోలీసులు హెచ్చరించారు. అనుమానాస్పద కాల్స్, లింక్స్, మెసేజ్‌లకు స్పందించవద్దని సూచించింది.

March 27, 2026 / 11:19 AM IST

ఈనెల 28న రేచిని వారసంత బహిరంగ వేలం

MNCL: తాండూర్ మండలం రేచిని గ్రామపంచాయతీ 2026-27 ఏడాదికి గాను ఈనెల 28న వారసంత బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిలు సంయుక్త ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు రేచిని జెండా సర్కిల్ ఆవరణలో జరుగుంతందన్నారు. ఆసక్తి గల వారు మార్కెట్ వేలం డిపాజిట్ రూ. 5000 చెల్లించి వేలంలో పాల్గొనాలన్నారు.

March 27, 2026 / 11:18 AM IST

‘డ్రగ్స్ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి’

PDPL: డ్రగ్స్ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని మంథని ఎక్సైజ్ ఎస్సై సాయికుమార్ సూచించారు. ముత్తారం మండల కేంద్రంలో ఆయన ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడితే 20 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ. 2 లక్షల జరిమానా ఉంటుందని హెచ్చరించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహేందర్, నిరంజన్ పాల్గొన్నారు.

March 27, 2026 / 11:15 AM IST

వేసవిలో విద్యుత్ కష్టాలకు చెక్.. ‘పవర్’ ఫుల్ ప్లాన్

NLG: వేసవిలో ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలగకుండా జిల్లా అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. సాధారణంగా రోజుకు 15 మిలియన్ యూనిట్ల వాడకం ఉండగా, ఏప్రిల్, మే నెలల్లో ఇది 22 మిలియన్ యూనిట్లకు చేరుతుందని అంచనా వేశారు. దీంతో లోడ్ తట్టుకునేందుకు సబ్జెస్టేషన్లలో అదనపు ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు.

March 27, 2026 / 11:14 AM IST

రాములవారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు అందజేత

RR: శ్రీరామ నవమిని పురస్కరించుకొని కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వలో సర్పంచ్ లలిత గోపాల్ నాయక్ సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీతారామచంద్రస్వామి కృప కటాక్షాలు ప్రాంత ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సిరాజ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

March 27, 2026 / 11:14 AM IST

WGLలో భారీ సైబర్ మోసం

WGL: నగరంలో ఒక రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను సైబర్ నేరగాళ్లు స్టాక్ మార్కెట్ పెట్టుబడి పేరుతో మోసం చేసి రూ.కోటి డబ్బు దోచుకున్నారు. నకిలీ వెబ్‌సైట్ ద్వారా పరిచయం చేసుకుని, విడతల వారీగా డబ్బు జమ చేయించిన మోసగాళ్లు, చివరకు ఆదాయపన్ను పేరుతో అదనంగా డబ్బు అడగడంతో బాధితుడికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

March 27, 2026 / 11:06 AM IST

జిల్లాలో తడి-పొడి చెత్తపై అవగాహన కార్యక్రమం

VKB: వికారాబాద్ 30వ వార్డులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఛైర్‌పర్సన్ గడ్డం అనన్య పాల్గొని చెత్తను వేర్వేరు డబ్బాల్లో వేసి సేకరణ వాహనాలకు ఇవ్వాలని సూచించారు. వార్డు సమస్యలను పరిశీలించి త్వరిత పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ఛైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్ విజయలక్ష్మీ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

March 27, 2026 / 11:05 AM IST

రాజుమురారికి ఉగాది ప్రతిభ పురస్కారం

MHBD: ప్రముఖ టీవీ సీరియల్స్ దర్శకుడు రాజుమురారికి ఉగాది ప్రతిభాపురస్కారం లభించింది. మానుకోట జిల్లా సూదనపల్లి గ్రామానికి చెందిన రాజుమురారికి మానస ఆర్ట్స్ థియేటర్, GSR ఫ్రెండ్స్ ఈవెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఈ ఉగాది ప్రతిభా పురస్కారం అందజేశారు. తనకు ఈ పురస్కారం రావడం సంతోషంగా ఉందని మురారి తెలిపారు.

March 27, 2026 / 11:04 AM IST

ఈనెల 30న ప్రభుత్వ వాహనం వేలం

ఆదిలాబాద్ జిల్లా పౌర సరఫరాల శాఖలో గల ప్రభుత్వ వాహనం (నడపడానికి అనుకూలంగా లేని) టాటా సుమో వాహనాన్ని ఈనెల 30న బహిరంగ వేలం వేస్తున్నట్లు DSO నందిని తెలిపారు. ఆసక్తి గల వారు 30న మధ్యాహ్నం 3 గంటలకు అదనపు కలెక్టర్ రెవిన్యూ కార్యాలయంలో జరిగే వేలం పాటలో పాల్గొనాలని సూచించారు.

March 27, 2026 / 11:04 AM IST

ఒక్క మెసేజ్ చేస్తే.. కరెంట్ సమస్య క్లియర్

HYD, RR, MDCL జిల్లాల పరిధి ప్రాంతాల్లో కరెంటు సమస్యల పై సులభంగా ఫిర్యాదు చేయొచ్చు. 8712441912 నంబర్‌కు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపితే సరిపోతుందని TGSPDCL తెలిపింది. బిల్లులు, మీటర్ సమస్యలు, విద్యుత్ సరఫరా అంతరాయం వంటి ఫిర్యాదులను ఈ నంబర్ ద్వారా స్వీకరించి త్వరగా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

March 27, 2026 / 11:02 AM IST

శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

BHNG: శ్రీరామనవమి సందర్భంగా ఆలేరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శుక్రవారం శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలంతా శ్రీరామనవమిని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. నవమి రోజున ప్రతి ఏటా వైభవోపేతంగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటారన్నారు. సీతారాముల పవిత్ర బంధం రాబోయే తరాలకు ఆదర్శనీయమైనదని ఆయన అన్నారు.

March 27, 2026 / 11:01 AM IST

పన్ను వసూళ్లలో అలసత్వం చేయకూడదు: కమిషనర్

WGL: గ్రేటర్ వరంగల్ నగరంలోని పలు ప్రాంతాలను ఇవాళ HNK జిల్లా కలెక్టర్ & బల్దియ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె పన్ను వసూళ్ల తీరును పరిశీలించారు. ఈ నెల 31వ తేదీలోగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పన్ను వసూళ్లలో ఎలాంటి అలసత్వాన్ని ఉపేక్షించేది లేదని, నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.

March 27, 2026 / 11:00 AM IST

రామయ్య పెళ్లికి కోనసీమ కొబ్బరి బోండాలు

BDK: భద్రాచలం రామయ్య పెళ్లికి కోనసీమ కొబ్బరి బోండాలు వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని మండపేట గ్రామం నుంచి 24 ఏళ్లుగా రామయ్య పెళ్లిలో వినియోగించే కొబ్బరి బోండాలను రామారెడ్డి మహాలక్ష్మి దంపతులు శంఖుచక్రాలు, తిరునామాలు, సీతారామ పేర్లతో అలంకరణ చేసి రామయ్య పెళ్లికి కానుకగా అందజేస్తున్నారు.

March 27, 2026 / 10:56 AM IST

గిరిజన విద్యార్థులకు దరఖాస్తుల ఆహ్వానం..!

MLG: ఇంచర్లలోని గిరిజన గురుకుల ప్రతిభ కళాశాల (COE)లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం MPC, BPC కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఝాన్సీ తెలిపారు. ఇటీవల పదవ తరగతి పూర్తి చేసిన గిరిజన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. గిరిజన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 27, 2026 / 10:51 AM IST