HYD: సామాజిక మాధ్యమాల్లో అమ్మాయిల ఫోటోలు, వీడియోలను ఎరగా ఉపయోగిస్తూ మోసగాళ్లు కొత్త పద్ధతుల్లో యువతను వలలో వేస్తున్నారు. AI సాయంతో అమ్మాయి వాయిస్‌లా ఫోన్ కాల్స్ చేసి నమ్మకం కల్పించి, చివరికి డబ్బులు దోచేస్తున్నారు. ఈ తరహా సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని HYD పోలీసులు హెచ్చరించారు. అనుమానాస్పద కాల్స్, లింక్స్, మెసేజ్‌లకు స్పందించవద్దని సూచించింది.