• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

బీజేపీపై ఆదరణ పెరిగింది: రాథోడ్

నిర్మల్: బీజేపీపై ప్రజలకు ఆదరణ పెరిగిందని బీజేపీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్కా కొమురయ్య విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ నాయకులతో కలిసి మంగళవారం ఖానాపూర్ పట్టణంలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ అంకం మహేందర్, రాష్ట్ర కౌన్సిలర్ మెంబర్ శ్రీనివాస్ ఉన్నారు.

March 4, 2025 / 05:03 PM IST

‘అవినీతి లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరగాలి’

HNK: ఇందిరమ్మ ఇండ్ల మంజూరిలో ఎటువంటి అవకతవకలకు అవినీతికి తావు లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరగాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నేడు ఆయన ఇందిరమ్మ కమిటీల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. లబ్ధిదారులకు పార్టీ కార్యకర్తలు అందించాల్సిన సహాయంపై దిశానిర్దేశం చేశారు.

March 4, 2025 / 04:59 PM IST

‘వికలాంగులకు ఐదు శాతం కేటాయించాలి’

SRD: వికలాంగులకు ఇందిరమ్మ ఇల్లు 5 శాతం కేటాయించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కార్యదర్శి అడివయ్య డిమాండ్ చేశారు. సంగారెడ్డి‌లోని కేవల్ కిషన్ భవన్‌లో మంగళవారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వికలాంగులకు ఉపాధి హామీలు ఏడాదికి 150 రోజులు పని కనిపించాలని కోరారు.

March 4, 2025 / 04:52 PM IST

పోలీస్ కమిషనరేట్ చేరిన నూతన జాగిలాలు

WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లోకి 5 జాగిలాలు నూతనంగా వచ్చి చేరాయి. నేడు హనుమకొండ జిల్లా కేంద్రంలో ఉన్న పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్‌లో జాగిలాలను సీపీ అంబర్ కిషోర్జా పరిశీలించారు. నేరస్తులను పట్టుకోవడంలో జాగిలాల పాత్రను ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా జాగిలాలకు శిక్షణ ఇస్తున్న సిబ్బందితో పలు అంశాలపై చర్చించారు.

March 4, 2025 / 04:35 PM IST

మీర్పేట్ పర్యటించిన ఎమ్మెల్యే, కమిషనర్

హైద్రాబాద్: మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్‌లో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మీర్పేట్ హెచ్‌పీ కాలనీ డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్ వెనకాల పెండింగ్‌లో ఉన్న బాక్స్ డ్రైన్ వర్క్‌ను వారి దృష్టికి తీసుకురాగా ఆ ప్రాంతాన్ని సందర్శించి సానుకూలంగా స్పందించారు.

March 4, 2025 / 04:14 PM IST

విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే

రంగారెడ్డి: అబాకస్ వేదిక్ మ్యాథ్స్ జాతీయ స్థాయి పోటీలలొ శంషాబాద్ మండలం పెద్ద షాపూర్‌లోని సర్దార్ వల్లబా భాయ్ పటేల్ హైస్కూల్ విద్యార్థి రవి తేజ పాల్గొని తృతీయ స్థానం కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మంగళవారం అభినందించారు. విద్యార్థి జాతీయ స్థాయి పోటీలో విజయం సాధించినందుకు ఆనందం వ్యక్తం చేసారు.

March 4, 2025 / 04:12 PM IST

భారతీయ కిసాన్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవం

KMR: లింగంపేట్ మండల కేంద్రంలో భారతీయ కిసాన్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఆయా గ్రామాలలో కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించినట్లు మండల అధ్యక్షులు ఎల్లాల సాయిరెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆయా గ్రామాలకు చెందిన గ్రామకమిటి అధ్యక్షులు, రైతులతో కలిసి కిసాన్ సంఘ్ జెండా ఆవిష్కరణ చేశారు. వెంకటేష్ గౌడ్, పోచయ్య ఉన్నారు.

March 4, 2025 / 02:25 PM IST

‘బాలికలకు చట్టాలపై అవగాహన ఉండాలి’

SRD: బాలికలకు ఉన్న హక్కులు చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ అన్నారు. సదాశివపేట మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బాలికలకు, మహిళలకు ఉచితంగా సహాయం అందిస్తామని చెప్పారు. సమావేశంలో ఎస్సై కృష్ణయ్య, ప్రిన్సిపల్ లావణ్య పాల్గొన్నారు.

March 4, 2025 / 12:53 PM IST

‘విద్యార్థులకు మెరుగైన బోధన అందించండి’

SRD: విద్యార్థులకు ఉపాధ్యాయులు మెరుగైన బోధన అందించాలని సమగ్ర శిక్ష సీఎంఓ వెంకటేశం అన్నారు. సంగారెడ్డిలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు తొలిమెట్టు కార్యక్రమం పూర్తిస్థాయిలో అమలు చేయాలని పేర్కొన్నారు. ఆటపాటల ద్వారా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బోధన చేయాలని చెప్పారు. సమావేశంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

March 4, 2025 / 12:50 PM IST

రాష్ట్రస్థాయి అర్చరి ఛాంపియన్ షిప్ పోటీల్లో స్వర్ణ పథకం

SDPT: తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీల్లో సిద్దిపేటకు చెందిన రష్మీత రెడ్డి స్వర్ణపతకం సాధించింది. గతంలో జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 31 మంది క్రీడాకారులకు ఇటీవల పోటీలు నిర్వహించారు. అందులో రష్మిత రెడ్డి ప్రథమ స్థానంలో నిలిచింది.

March 4, 2025 / 12:15 PM IST

జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం

SRPT: జిల్లా కేంద్రంలోని 19 వ వార్డు విజయ కాలనీ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర జాతీయ రహదారి 65 పై రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం పల్లె వెలుగు బస్సు, రోడ్డు రోలర్ ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 4, 2025 / 11:10 AM IST

తునికాకు టెండర్ల ప్రక్రియను ప్రారంభించాలి

BDK: భద్రాచలం డివిజన్‌లో తునికాకు సేకరణ టెండర్లు ఖరారు చేయాలని ఆదివాసీ సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేత ముసలి సతీష్ అన్నారు. చర్ల సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. 2024 డిసెంబర్ నెలలోనే టెండర్లను పూర్తి చేసి కొమ్మకొట్టుడు పనులు పూర్తి చేయాలన్నారు. కానీ 2025 మార్చి వచ్చినా టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదన్నారు.

March 4, 2025 / 11:01 AM IST

రేపు స్వేరోస్ ముఖ్య నాయకుల సమావేశం

NGKL: స్వేరోస్ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు భీమ్ దీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యాచరణ గురించి రేపు జిల్లా కేంద్రంలో స్వేరోస్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించబోతున్నట్లు స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డపాకుల శివశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశం అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద భీమ్ దీక్ష కార్యక్రమం వాల్ పోస్టర్ ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు.

March 4, 2025 / 11:01 AM IST

గంగమ్మవాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని వినతి

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల శివారులో గల గంగమ్మవాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు ఆర్అండ్‌బీ టీ కార్యాలయంలో డిఎఓ సంతోషికి వినతి పత్రం అందజేశారు గత కొన్ని నెలలుగా నిర్మాణ పనులు జాప్యం కారణంగా ప్రయాణికులకు వాహనాల దారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.మాజీ జెడ్పీటిసి రాజేశ్వరరావు, శ్రీనివాస్, సతీష్ఉన్నారు

March 4, 2025 / 10:54 AM IST

మిర్చిబోర్డు ఏర్పాటు చేయాల్సిందే

KMM: రాష్ట్రంలోనే అత్యధికంగా మిర్చి క్రయవిక్రయాలు జరిగే ఖమ్మంలో మిర్చిబోర్డు ఏర్పాటు చేసి క్వింటాకు రూ. 25 వేల చొప్పున ధర చెల్లించాలని ఎమ్మెల్సీ తాతా మధు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు డిమాండ్ చేశారు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించి మాట్లాడారు. వ్యాపారులు ధరలు తగ్గిస్తుండడంతో మరింత నష్టం ఎదురవుతోందని చెప్పారు.

March 4, 2025 / 10:49 AM IST