• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘వెన్నెల నగర్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి’

BDK: కొత్తగూడెం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సోమవారం ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కమిటీ సభ్యులు పాల్గొని మాట్లాడుతూ.. వెన్నెల నగర్లో విద్యుత్, మంచినీటి సమస్య తీవ్ర స్థాయిలో ఉందని, పలుమార్లు అధికారులకు వెల్లడించిన ఫలితం లేకుండా పోవడంతో ధర్నాకు దిగినట్లు వెల్లడించారు. వెన్నెల నగర్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

March 30, 2026 / 11:39 AM IST

నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీలు

HNK: శాసనమండలి సమావేశాల నేపథ్యంలో గన్ పార్క్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అక్రమ మైనింగ్ పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే హౌస్ కమిటీని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, రవీందర్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.

March 30, 2026 / 11:39 AM IST

గనులపై నల్ల బ్యాడ్జీలు ధరించి కార్మికుల నిరసన

MNCL: మందమర్రి ఏరియాలోని అన్ని గనులు, డిపార్ట్మెంట్లపై కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. గుర్తింపు AITUC సంఘం ఆధ్వర్యంలో సోమవారం జరుగునున్న ‘సేవ్ సింగరేణి’ కార్యక్రమానికి కొత్తగూడెంలోని ప్రధాన కార్యాలయం ముట్టడి నిర్వహిస్తున్నారు. ముట్టడికి మద్దతుగా కార్మికులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి, యాజమాన్యాలకు వ్యతిరేఖంగా నిరసన తెలిపారు.

March 30, 2026 / 11:35 AM IST

ఆలయ అభివృద్ధికి రూ.1 లక్ష విరాళం

NZB: కమ్మర్ పల్లిలోని నాగపూర్ గ్రామంలోని పురాతన రామాలయం అభివృద్ధికి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి రూ.లక్ష విరాళం అందజేశారు. గ్రామంలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ఆయన ఈ మేరకు స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులను కలిసి రామాలయం అభివృద్ధికి తనవంతుగా రూ.లక్ష విరాళం అందించారు. కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

March 30, 2026 / 11:32 AM IST

లేబర్ కోడ్స్‌పై కార్మికుల ఆగ్రహం

WNP: ఆత్మకూరు గాంధీ చౌరస్తాలో టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ ఆధ్వర్యంలో కార్మికులు 4 లేబర్ కోడ్స్ ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ కోడ్స్ కార్మికుల హక్కులను హరించేలా ఉన్నాయని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ చట్టాలను రద్దు చేయాలని సోమవారం డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలు కొనసాగితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

March 30, 2026 / 11:30 AM IST

‘ఉపాధి హామీ కూలీలకు రెండు సార్లు హాజరు వేయాలి’

ASF: ఉపాధి హామీ పథకానికి వెళ్లే కూలీలకు 2 పూటల హాజరువేయాలని బెజ్జుర్ APO రాజన్న తెలిపారు. కూలీల నుంచి ఆండ్రాయిడ్ ఫోన్‌పై అవగాహన ఉన్న ఒకరికి శిక్షణ ఇస్తామన్నారు. కూలికి వెళ్లేవారు గ్రామసభకు హాజరై కొత్త విధానాన్ని నేర్చుకొని కూలీకి వెళ్లాల్సిందిగా సూచించారు. ప్రతి కూలి ఉదయం ఫేస్ రీడింగ్ హాజరు వేసుకున్న తర్వాత తిరిగి 4 గంటలకు మళ్లీ హాజరు వేయాలని సూచించారు.

March 30, 2026 / 11:27 AM IST

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో ఉద్యమకారుల బైండోవర్

JBL: తెలంగాణ ఉద్యమకారుల అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో రేగొండ ఎస్సై సుధాకర్ ఆధ్వర్యంలో సోమవారం ముందస్తు చర్యలు చేపట్టారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పలువురు ఉద్యమకారులను పోలీసులు బైండోవర్ చేశారు. బైండోవర్ అయిన వారిలో పున్నం రవి, రూపురెడ్డి లింగారెడ్డి, పట్టెం శంకర్, గోగుల అశోక్ రెడ్డి, పత్తి బుచ్చిరెడ్డి, గండి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

March 30, 2026 / 11:24 AM IST

అదుపు తప్పి డివైడర్ ఎక్కిన టాటా ఏసీ

SRPT: మునగాల మండలం ముకుందాపురం గ్రామ శివారులో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట నుంచి కోదాడ వైపు మాంసపు వ్యర్ధాలతో వెళ్తున్న టాటా ఏసీ వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనంలోని వ్యర్థాలు రోడ్డుపై పడటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతుంది. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

March 30, 2026 / 11:24 AM IST

రామన్నపేటలో ఉద్రిక్తత… ఉద్యమ నాయకుల అరెస్టులు

BHNG: రామన్నపేట మండలంలో సోమవారం తెల్లవారుజామున పోలీసులు ముందస్తు చర్యలకు దిగారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ షేక్ చాంద్‌ను రామన్నపేట టౌన్ పోలీసులు అరెస్టు చేయగా, తెలంగాణ ఉద్యమ నాయకుడు బొడ్డుపల్లి లింగయ్యను హౌస్ అరెస్టు చేశారు.

March 30, 2026 / 11:23 AM IST

పబ్లిక్ టాయిలెట్స్ పరిశీలించిన మున్సిపల్ ఛైర్మన్

KNR: జమ్మికుంట పట్టణంలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా పట్టణ ప్రజలకు సౌకర్యాలు మెరుగు పరిచేందుకు మున్సిపల్ ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ పబ్లిక్ టాయిలెట్స్‌ను పరిశీలించారు. ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ శ్రీకాంత్ కలిసి పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన టాయిలెట్స్ తనిఖీ చేసి పరిశుభ్రత, నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు.

March 30, 2026 / 11:23 AM IST

18 వ శతాబ్దం కాలం నాటి కటమయ్య విగ్రహం గుర్తింపు

NRML: ఖానాపూర్ మండలం బావాపూర్ కే గ్రామంలోని గోదావరి తీరంలో పురాతన కాటమయ్య విగ్రహాన్ని గుర్తించినట్లు ప్రముఖ చరిత్ర పరిశోధకుడు రాజ్ కుమార్ తెలిపారు. కాటమయ్య విగ్రహం కుడి చేతిలో ఖడ్గం ధరించి తలకు చిరస్థానం పెట్టుకొని బుగ్గ మీసాలతో పెద్ద చెవులతో గుర్రంపై స్వారీ చేస్తున్న రూపంలో ఈ విగ్రహం ఉంది. ఈ విగ్రహం 18వ శతాబ్ద కాలనాటికి చెందినదిగా వారు తెలిపారు.

March 30, 2026 / 11:22 AM IST

బైక్ అదుపుతప్పి ధర్మారం తండా వాసి మృతి

KMR: పిట్లం మండలంలోని చిన్న కొడఫ్గల్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ధర్మారం తండాకు చెందిన జాదవ్ రాజు (28) మృతి చెందారు. ఆదివారం తన వాహనం ఫైనాన్స్ కట్టడానికి బైక్‌పై పిట్లం వెళ్లి వస్తుండగా, బైక్ అదుపుతప్పి పొలాల్లో పడిపోవడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు సోమవారం ఎస్సై వెంకట్రావు తెలిపారు.

March 30, 2026 / 11:21 AM IST

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో ఉద్యమకారులు ముందస్తు అరెస్ట్

WGL: తెలంగాణ ఉద్యమ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. హామీలను నెరవేర్చలేదని నిరసనగా నిర్వహించనున్న “చలో అసెంబ్లీ” ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా సోమవారం వర్ధన్నపేట మండలం ఇల్లంద మాజీ సర్పంచ్ సుంకరి సాంబయ్య, వేణుగోపాల్ రావు ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సొంత పూచుకత్తుపై విడుదల చేశారు.

March 30, 2026 / 11:20 AM IST

‘క్రీడా పోటీలలో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే’

PDPL: ఈనెల 28 నుంచి హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వాలీబాల్, క్రికెట్ పోటీలలో ఆయన తన ప్రతిభ చూపారు.

March 30, 2026 / 11:15 AM IST

హామీలతో మోసం చేస్తున్న ఆసుపత్రి

NLG: నాంపల్లిలో వైద్య సేవలు అధ్వానంగా మారాయి. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రోగుల తాకిడి పెరుగుతున్నా, సిబ్బంది కొరత, మందుల లేమి రోగులకు శాపంగా పరిణమించాయి. గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన 30 పడకల ఆసుపత్రి హామీ ఇప్పటికీ కార్య రూపం దాల్చకపోవడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

March 30, 2026 / 11:14 AM IST