KNR: కరీంనగర్ అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో MLC ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఇండిపెండెంట్ MLC అభ్యర్థులు నిరసన తెలిపారు. చెల్లని ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, మళ్లీ రీ-ఎలక్షన్ జరపాలని నినాదాలు చేశారు. ఎన్నికల కమిషన్ అవగాహన కల్పించకపోవడంతో ఈ తప్పిదం జరిగిందని ఆరోపిస్తూ నిరసన తెలిపారు. ఎన్నికల సంఘం స్పందించి రీ- ఎలక్షన్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.