KMM: మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామంలో సోమవారం వీధి కుక్కలు దాదాపు 6 మంది మీద దాడి చేసి భీభత్సం సృష్టించాయి. గతంలో కూడా గ్రామంలో కుక్కలు పలువురిపై తీవ్రంగా దాడి చేశాయి. మళ్లీ నేడు వీధి కుక్కలు రెచ్చిపోయి ఆరుగురు మీద దాడి చేసి ముగ్గురిని తీవ్రంగా గాయపరచడంతో స్థానిక గ్రామ ప్రజలు గాయపడిన వారిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.