GNTR: ఫిరంగిపురంలో సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి నిర్వహించారు. సిఐటియు మండల కార్యదర్శి మస్తాన్ వలి సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు బోయలపల్లి ఇబ్రహీం, కే ఏసు, సునీత, ఏసమ్మ, తదితరులు పాల్గొన్నారు.