ELR: జంగారెడ్డిగూడెం 2022 మార్చిలో పరిసరాల్లో కల్తీ మద్యం వల్ల 20 మంది మృతిచెందారు. కల్తీ మద్యం మరణాలపై ముగ్గురు అధికారులతో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు జిల్లా ఎస్పీ కిశోర్ నేతృత్వంలో ఏర్పాటు కానున్న టాస్క్ఫోర్స్లో ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమార్ తదితరులను నియమించారు.