అన్నమయ్య: రామసముద్రం మండలంలో ఒక మహిళ హత్య కేసకు సంబంధించి ముగ్గురు నిందితులను సోమవారం అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ విద్య సాగర్ నాయుడు తెలిపారు. కాళ్ళు చేతులు కట్టేసి, మెడకు త్రాడు బిగించి హత్యచేసి అత్యంత కిరాతకంగా మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆమె హత్యకు కారణమైన ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్పీ తెలిపారు.