WGL: నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి బుధవారం నెక్కొండ మండలంలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. నెక్కొండ-సంగెం, జల్లి – లింగగిరి రోడ్ల పనులు పూర్తవగా.. ఆయన రోడ్లను ప్రారంభిస్తారన్నారు. అనంతరం R&B బైపాస్ నుంచి సాయిరెడ్డిపల్లి వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.